- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చేతి వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం చేయూత
దిశ, తెలంగాణ బ్యూరో: చేతి వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తుందని పలు కార్పొరేషన్ల చైర్మన్లు అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్, కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, టెక్స్టైల్ అభివృద్ధి సంస్థ చైర్మన్ గూడూరి ప్రవీణ్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్లు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాదిమంది చేతివృత్తుల ప్రజలు ప్రభుత్వ సాయంతో లబ్ధి పొందుతున్నారని అన్నారు. లబ్దిదారుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను ప్రజలకు చేరవేసేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలను ప్రజాక్షేత్రంలో తీసుకెళ్తామన్నారు.