ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం మరిన్ని కీలక బాధ్యతలు

by GSrikanth |
ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం మరిన్ని కీలక బాధ్యతలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం హెచ్‌జీసీఎల్ ఎండీగా, HMDA జాయింట్ కమిషనర్‌‌గా, ఐటీ, రియల్ ఎస్టేట్ విభాగాలతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌ ఎండీగా ఆమ్రపాలి బాధ్యతలు నిర్వర్తిస్తు్న్నారు. తాజాగా.. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్‌జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌, ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఎండీగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. కాగా, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగుతున్న సమయంలో ఆమ్రపాలి కేంద్రంలో విధులు నిర్వహించారు. డిప్యుటేషన్‌పై పీఎంవోలో కీలక బాధ్యతల్ని నిర్వహించారు. ఇటీవల జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణకు తిరిగివచ్చిన ఆమ్రపాలికి HMDA కమిషనర్‌గా కీలక బాధ్యతలు అప్పగించింది రేవంత్ సర్కార్. ప్రస్తుతం మరిన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed