- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రిడిటేషన్ లేని మహిళా జర్నలిస్టులకు సర్కార్ శుభవార్త
దిశ, తెలంగాణ బ్యూరో: అక్రిడిటేషన్ లేని మహిళా జర్నలిస్టులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. అక్రిడిటేషన్ లేకపోయినా మహిళా జర్నలిస్టులందరికీ మాస్టర్హెల్త్చెకప్లు నిర్వహిస్తామని సమాచార శాఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఏప్రిల్ 9వ తేదీ వరకు (ఏప్రిల్ 2వ తేదీ ఆదివారం మినహా ) ఈ మాస్టర్ హెల్త్ చెకప్‌లు కొనసాగుతాయని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులతోపాటు, పత్రికా, న్యూస్ ఛానళ్లలో పనిచేస్తూ ఆర్గనైజేషన్ గుర్తింపు కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఐఅండ్పీఆర్కమిషనర్అరవింద్ కుమార్ స్పష్టం చేశారు.
ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్‌లో రక్త పరీక్ష (సీబీపీ), బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బీ12, డీ3 తో పాటు ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు నిర్వహించి. నివేదికలను అదే రోజున అందజేయనున్నట్టు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, అర్వింద్ కుమార్ తెలిపారు.