- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశాలు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కు చెందిన టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం బంఫర్ ఆఫర్ ఇచ్చింది. గత నెల వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగిన టీ-20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచి టీమిండియా విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో సభ్యుడైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన ఇంటి స్థలాన్ని వెంటనే గుర్తించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలసిందిగా అధికారులకు సీఎం సూచించారు.
కాగా, సీఎం రేవంత్ రెడ్డిని మహ్మద్ సిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. టీ-20 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్న సిరాజ్ మంగళవారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి.. సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన హైదరాబాదీ పేసర్ సిరాజ్‌ను రేవంత్ అభినందించారు. మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడని కొనియాడారు. అందుకే ఈ రోజు అత్యున్నత స్థాయి క్రికెటర్లలో ఒకడుగా పేరు సంపాదించుకున్నారని ప్రశంసించారు. సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.