- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
హరితహారం పేరు మార్చిన తెలంగాణ సర్కార్.. కొత్త నేమ్ ఏంటంటే..?
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మొక్కలు పెంచే ఈ కార్యక్రమాన్ని ఇక నుంచి 'వన మహోత్సవం' పేరుతో నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఈ కార్యక్రమాన్ని 'తెలంగాణకు హరితహారం' పేరుతో నిర్వహించేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పేరు మార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వన మహోత్సవం పేరుతోనే పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. 1950లో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. 75 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో తాజా కార్యక్రమానికి 'వజ్రోత్సవ వన మహోత్సవం'గా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది.
తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా, రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, స్టీరింగ్ కమిటీలను కొత్తగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా సమన్వయ కమిటీకి కలెక్టర్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. అలాగే రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీకి అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్గా వ్యవహరించనుండగా ఎనిమిది మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉండనున్నారు .