Govt Holiday: ఈ నెల 7,17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ

by Ramesh Goud |   ( Updated:2024-09-04 15:13:11.0  )
Govt Holiday: ఈ నెల 7,17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సెప్టెంబర్ 7,17 తేదీలను తెలంగాణ ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధరణంగా గణేష్ చతుర్థి, మిలద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా ఇదివరకే సెలవులు ప్రకటించిన విషయం తెలిసింది. గణేష్ చతుర్థి 7 వ తేదీన ఉండగా.. మలాద్ ఉన్ నబీ ఈ నెల 16 తేదీన ఉన్నట్లు అధికారిక క్యాలెండర్ లో ప్రకటించింది. అయితే మిలాద్ ఉన్ నమీ అనేది నెలవంక దర్శనం తేదీన జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి.. సెలవు తేదీని మార్చుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దీంతో 7 వ తేదీన గణేష్ చతుర్థి , 17న మిలాద్ ఉన్ నబీకి సెలవులను ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అయితే వినాయక చవితి ఈ నెల 7న ప్రారంభమై 17 నిమజ్జన కార్యక్రమం జరుగుంది. ప్రభుత్వం ప్రతీ ఏడాది గణేష్ నిమజ్జనం రోజున అధికారిక సెలవు ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో మిలాద్ ఉన్ నబీ హాలీడే ఆ రోజే రావడంతో నిమజ్జన సెలవు కూడా అందులోనే ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా 17న గణేష్ నిమజ్జనం ర్యాలీ కార్యక్రమం ఉండటంతో అదే రోజు జరగాల్సిన మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు కార్యక్రమం వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కార్యక్రమం 19 వ తేదిన జరపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story