- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Telangana Floods 2024: ముఖ్యమంత్రి సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం
దిశ, డైనమిక్ బ్యూరో: వరదబాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు రూ.50 వేల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తెలంగాణలో పలు చోట్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభివించాయి. ఈ వరదల వల్ల చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలోనే వరద బాధితులకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చాలామంది సినీ, రాజకీయ వ్యాపార వేత్తలు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు అందజేశారు. ఈ విరాళాల వెళ్లువ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ క్రమంలోనే ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన కుమారీ ఆంటీ కూడా వరద భాదితులకు తమ వంతు సాయం చేశారు. కుటుంబసభ్యులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 50 వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, కుమారీ ఆంటీని శాలువాతో సత్కరించి, బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే టెక్నో పెయింట్స్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.20లక్షలు విరాళం అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టెక్నో పెయింట్స్ డైరెక్టర్స్ ఆకునూరి శ్రీనివాస్ రెడ్డి, సీవీఎల్ఎన్ మూర్తి, అనిల్ కొండోత్ ఈ విరాళానికి సంబంధించిన చెక్ ను సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.