- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress: అంబేడ్కర్ మాకు దేవుడితో సమానం.. అమిత్‌షా వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ భారీ ర్యాలీ
దిశ, డైనమిక్ బ్యూరో: అంబేడ్కర్ మాకు దేవుడితో సమానం.. అంటూ టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్కొన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యలకు నిరసనగా (Telangana Congress) టీపీసీసీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. అంబేడ్కర్ పేరు లక్షల, కోట్ల సారైనా నిత్యం స్మరిస్తూనే ఉంటామని తెలిపారు. అంబేడ్కర్ పేరు బీజేపీ నేతలకు ఫ్యాషన్ అయితే, మాకు మాత్రం ఆరాధ్య దైవమన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, మనుస్మృతి అమలు చేసేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. తక్షణమే అమిత్‌షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమిత్‌షాపై చర్యలు తీసుకునేంతవరకూ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని వెల్లడించారు.
అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి నిరసనలు తెలిపితే కుట్రపూరితమైన కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. భారతీయుల ఆరాధ్యమైన అంబేడ్కర్‌ను అవమానించిన బీజేపీ తీరును ప్రజాస్వామ్య రీతిలో ఎండగడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై కేసు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. మనుస్మృతిని, సావర్కర్‌ను అనుసరించే మీరు అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి మీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేశారని అన్నారు. నిత్యం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తప్పుపట్టే బీజేపీ నేతలు.. ఇప్పుడు అంబేద్కర్‌ను కూడా తూలనాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి బీజేపీపై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పోరాడుతోందని అన్నారు.