Telangana Cabinet : ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ భేటీ ?

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-13 07:35:15.0  )
Telangana Cabinet : ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ భేటీ ?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) సమావేశం ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరుగనున్నట్లుగా సమాచారం. అసెంబ్లీలో కమిటీ హాల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు చట్ట సవరణ బిల్లులకు క్యాబినెట్ ఆమోదం తెలుపనుందని తెలుస్తోంది. అలాగే మూసీ నది ప్రక్షాళన, కులగణన సర్వే, స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా విధి విధానాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై కేబినెట్ డిస్కస్ చేయనున్నట్లు తెలిసింది.

సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దీనిపై కేబినెట్ కీలక నిర్ణయం వెలువరించే అవకాశముంది. 16నుంచి శీతకాల అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్న క్రమంలో కేబినెట్ భేటీపై ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story