- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్‌కు తగ్గని వైరల్ ఫీవర్.. నేటి కేబినెట్ భేటీ వాయిదా
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వైరల్ ఫీవర్, దగ్గు, జలుబుతో గత వారం రోజులుగా ఆయన బాధపడుతుండగా.. ప్రగతిభవన్‌లో ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఇంకా అనారోగ్యం నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో నేడు జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. కేసీఆర్ కోలుకున్న తర్వాత అక్టోబర్ మొదటివారంలో కేబినెట్ భేటీ జరగనుందని తెలుస్తోంది.
గవర్నర్ కోటా కింద సిఫార్సు చేసిన ఇద్దరి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తమిళిసై తిరస్కరించడంపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. మంత్రులు, బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌పై విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతగా ఆమె ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. కేబినెట్ సమావేశంలో దీనితో పాటు ఎన్నికల వేళ పలు కీలక అంశాలు చర్చించాలని భావించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై కేబినెట్‌లో చర్చ జరగాల్సి ఉంది. అక్టోబర్ రెండో వారంలో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముంది. దీంతో అక్టోబర్ మొదటివారంలో కేబినెట్ సమావేశం జరిగితే, అదే చివరి భేటీగా నిలవనుంది. దసరా తర్వాత ప్రచారం మొదలుపెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. మేనిఫెస్టోను విడుదల చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థల పేర్లతో తొలి జాబితాను ప్రకటించగా.. అందులో మైనంపల్లి టికెట్ ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్‌కు వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానంతో కలిపి 5 నియోజకవర్గాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేస్తోంది. త్వరలోనే రెండో జాబితాను బీఆర్ఎస్ విడుదల చేయనుంది.