Telangana Budget: బడ్జెట్ పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు!

by Ramesh Goud |
Telangana Budget: బడ్జెట్ పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు సంక్షేమం కోసం పెద్ద పీట వేశారని, భవిష్యత్తులో విద్యా, వైద్య రంగాలకు నిధులు కేటాయించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రానికి సంబందించి 2024-25 వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్ధిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ పై ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేశారని, అలాగే విద్యా, వైద్యా రంగానికి కూడా కేటాయింపులు జరిపితే బాగుండేదని అన్నారు. భవిష్యత్తులోనైనా విద్యా, వైద్య రంగాలకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే అసంఘటిత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. ఈ సంక్షోభానికి గత ప్రభుత్వం చేసిన అప్పులే కారణమని అన్నారు. ఇక కష్ట, సంక్షోభ కాలంలో ఇలాంటి బడ్జెట్ పెట్టడం సాహోపేతమైన నిర్ణయమని కూనంనేని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed