- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: ఖరారైన బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు వీళ్లే!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు దాదాపు ఖరారు అయ్యారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ గెలుపు గుర్రాలనే బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. అందరూ ఊహించినట్లుగానే ఆదిలాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకే అధిష్టానం మళ్లీ అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఫైనల్ కానట్లు తెలుస్తోంది. నాలుగైదు స్థానాల్లో ఒక్కో స్థానానికి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నా.. పోటీ చేయబోయే అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఏ క్షణం అయినా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అధిష్టానం పరిశీలిస్తున్న అభ్యర్థులు :
కరీంనగర్ = బండి సంజయ్
నిజామాబాద్ = ధర్మపురి అర్వింద్
సికింద్రాబాద్ = కిషన్ రెడ్డి
మల్కాజ్‌గిరి = ఈటల రాజేందర్, మురళీధర్ రావు
మహబూబాబాద్ = హుస్సేన్ నాయక్, సీతయ్య
వరగంల్ = కృష్ణ ప్రసాద్, కల్యాణ్
మెదక్ = రఘునందన్ రావు, అంజిరెడ్డి
జహీరాబాద్ = జైపాల్ రెడ్డి, దిల్ రాజు
మహబూబ్‌నగర్ = డీకే అరుణ, జితేందర్ రెడ్డి
నాగర్ కర్నూలు = పోతుగంటి రాములు, పోతుగంటి భరత్
భువనగిరి = బూర నర్సయ్య గౌడ్, గూడూరు నారాయణ
హైదరాబాద్ = మాదవీలత