- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ BJP పార్లమెంట్ అభ్యర్థులు వీళ్లే
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే 195 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. గతానికి భిన్నంగా ఈ సారి కీలక నేతలకు పార్టీ షాకిచ్చింది. యువతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మూడు, నాలుగు సార్లు పోటీ చేసిన సీనియర్లను పక్కనబెట్టింది. మరోసారి వారణిసి నుంచి ప్రధాని మోడీ, గాంధీ నగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేయబోతున్నారు. ఈ తొలి జాబితాలో 34 కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. మహిళలు-28, యువకులు-47, ఎస్సీ-27, ఎస్టీ-18, ఓబీసీ-57 మంది ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి తొమ్మిది సీట్ల అభ్యర్థులను ప్రకటించారు. అందరూ అనుకున్న విధంగా ముగ్గురు సిట్టింగులను ఖరారు చేశారు.
తెలంగాణ లోక్‌సభ అభ్యర్థులు:
1. కిషన్ రెడ్డి = సికింద్రాబాద్
2. బండి సంజయ్ = కరీంనగర్
3. ధర్మపురి అర్వింద్ = నిజామాబాద్
4. కొండా విశ్వేశ్వర్ రెడ్డి = చేవెళ్ల
5. బూర నర్సయ్య గౌడ్ = భువనగిరి
6. పి. భరత్ = నాగర్ కర్నూలు
7. బీబీ పాటిల్ = జహీరాబాద్
8. ఈటల రాజేందర్ = మల్కాజ్‌గిరి
9. మాదవీలత = హైదరాబాద్