- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TS: ఈనెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈ నెల 6న ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3న రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై అసెంబ్లీ నిర్వహణపై చర్చించనున్న సమయంలో అసెంబ్లీ సెక్రటరీ ఈ ప్రకటన విడుదల చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయడం, నిర్వహణ., తదితర అంశాలపై క్యాబినెట్ చర్చించనున్నదంటూ ప్రగతి భవన్ గత నెల 29న ప్రకటించింది. తేదీల ఖరారుపై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటుందంటూ ప్రకటించినా ఆ సమావేశం జరగకముందే అసెంబ్లీ సెక్రటరీ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే తేదీని కార్యదర్శి ప్రకటించడంతో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేదానిపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కోరినా సభను నడపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదంటూ ప్రతీసారి స్పీకర్, అధికార పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగియడంతో ఈ నెల 15 లోగా మళ్లీ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్నది. అసెంబ్లీ కార్యదర్శి తేదీని ప్రకటించడంతో ఏయే అంశాలను ప్రభుత్వం ఈ సమావేశాల్లో ప్రస్తావించనున్నది, ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఎలాంటి తీర్మానాలను ప్రతిపాదించనున్నారు, ఎటువంటి ప్రకటనను చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రగతిభవన్ వర్గాలు తొలుత ప్రకటించిన ప్రకారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సెప్టెంబరు 3 మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్నది. ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనున్నది. ఈ రెండూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్నాయి. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చే కొద్దిమంది ఎంపీలు కూడా పాల్గొననున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, కొత్తగా అమలుచేస్తున్న ఆసరా పింఛన్లు, పోడు భూముల వివాదం తదితరాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.
Also Read : విమానంలో సెక్స్ ఎక్స్‌పీరియన్స్.. విచిత్రంగా ఉందన్న కరణ్