తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య కిడ్నాప్..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-13 07:00:19.0  )
తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య కిడ్నాప్..?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఉద్యమకారుడు, భారత్ బచావో వ్యవస్థాపక సభ్యులు గాదె ఇన్నయ్య కిడ్నాప్ వార్త కలకలం రేపుతోంది. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నారాయణ‌గూడలో బయటకి వెళ్లిన ఆయనను పోలీసులమని చెప్పి కొందరు వ్యక్తులు తీసుకెళ్లారని కుటుంబసభ్యులు పీఎస్ లో కంప్లైంట్ చేశారు. ఇన్నయ్యకు ప్రాణహాని ఉందని, ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు ఆందోళ చెందుతున్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించిన గాదె ఇన్నయ్య టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో కూడా ఒకరు. ఉమ్మడి ఏపీలో ఆయన రాసిన దగాపడ్డ తెలంగాణ పుస్తకం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లా జాఫర్ గడ్ గాదె ఇన్నయ్య స్వస్థలం.

Advertisement

Next Story

Most Viewed