MP Chamala : పన్నుల రాబడిని రాష్ట్రాలకు సమానంగా పంచాలి : ఎంపీ చామల

by Y. Venkata Narasimha Reddy |
MP Chamala : పన్నుల రాబడిని రాష్ట్రాలకు సమానంగా పంచాలి : ఎంపీ చామల
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్రానికి వచ్చే ఆదాయంతో పాటు రాష్ట్రాలు చెల్లించే పన్నుల రాబడికి(Tax revenue) సంబంధించిన నిధులను జనాభా ప్రకారం రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) కోరారు. ఉత్తర ప్రదేశ్ రాష్ర్టంలో హౌసింగ్‌, పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సమావేశానికి అధికారుల బృందంతో కలిసి హాజరైన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆ రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులు, కేటాయింపులను పరిశీలించారు. ఆర్ఆర్టీఎస్ (రీజీనల్ రాపిడ్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ )కు సంబంధించి ఢిల్లీ - ఘజియాబాద్, ఢిల్లీ - గురుగ్రామ్ - అల్వార్, ఢిల్లీ నుండి పానిపట్ (ఫేజ్1) ప్రణాళికను గూర్చి తెలుసుకున్నారు.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో ఇలాంటి అభివృద్ధి పనులు ఎందుకు జరగడం లేదని కిరణ్ కుమార్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఇలాంటి భారీ రవాణ సదుపాయాలు రోడ్ ట్రాఫిక్, ఉపాధి, నగరాల్లో నివసించే ప్రజల జీవన వ్యయంతో కూడిన వాటితో ప్రభావితం చూపుతుందని ఆయన అన్నారు. కేంద్రం రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల అన్న వివక్షత లేకుండా దేశ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి భారీ ప్రాజెక్టులను అమలు చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed