Ponnam Prabhakar: వాహనదారులకు పొన్నం గుడ్ న్యూస్.. త్వరలో వాటికి కూడా పన్ను రాయితీ:

by Prasad Jukanti |
Ponnam Prabhakar: వాహనదారులకు పొన్నం గుడ్ న్యూస్.. త్వరలో వాటికి కూడా పన్ను రాయితీ:
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యుత్ వాహనాలు కొంటే రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తూ కొత్త ఈవీ పాలసీని అమల్లోకి తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం అదే కోవలో మరో కీలక నిర్ణయం దిశగా యోచిస్తున్నది. రాబోయే రోజుల్లో హైబ్రిడ్ వాహనాల (Hybrid Vehicles) పై కూడా పన్ను రాయితీపై ఆలోచిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చెప్పారు. మంగళవారం ఎక్స్ వేదికగా ఈవీ పాలసీపై ఆయన పోస్టు చేశారు. ఢిల్లీలో ఏర్పడిన వాయు కాలుష్యం వంటి పరిస్థితి హైదరాబాద్, తెలంగాణలో రాకూడదనే మన రాష్ట్రంలో కొత్త ఈపీ పాలసీ తీసుకువచ్చినట్లు వెల్లడించారు.

ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఈవీ పాలసీ ఎలక్ట్రిక్ వాహనాలను విసృతంగా ప్రజలు వాడేలా ఉందన్నారు. ఈవి వాహనాలపై రోడ్డు టాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినట్లు వెల్లడించారు. కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్వచ్చందంగా స్క్రాప్ చేయించాలన్నారు. కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను మంత్రి ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed