- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామ పంచాయితీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి: సర్కార్‌కు తమ్మినేని డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ పంచాయితీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, జీవో ప్రకారం వేతనాల పెంపు, మల్టీపర్పస్ పనివిధానం రద్దు, తదితర సమస్యలను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు 50 వేల మంది గ్రామ పంచాయితీ కార్మికులు ఉన్నారని, వీరు పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, స్వీపర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్స్, కంప్యూటర్ ఆపరేటర్ తదితర కేటగిరిలలో విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. వీరిలో అత్యధికులు దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలకు చెందిన పేదలే అని, వీరి సమస్యలను చాలా కాలంగా పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నదన్నారు.
కొత్త గ్రామ పంచాయతీ చట్టం వచ్చాక ప్రస్తుత జనాభా ప్రాతిపదికన కాకుండా, 2011 జనాభా లెక్కల ప్రకారం 500 మందికి ఒక కార్మికుడిని నియమించి నెలకు ఒక్కో కార్మికుడికి రూ. 8500 లు మాత్రమే వేతనం చెల్లిస్తున్నారని, క్షేత్ర స్థాయిలో గ్రామ అవసరాల కోసం మరికొంతమంది కార్మికులను పంచాయితీ పాలకవర్గం నియమించుకున్నప్పటికీ వారందరికీ పైన పేర్కొన్న వేతనాలివ్వడం లేదన్నారు. జనాభా ప్రాతిపదికన నిర్ణయించిన వేతనాలనే అందరూ పంచుకుంటున్నారని తెలిపారు. దీంతో ఒక్కో కార్మికుడికి రు.3500ల నుంచి రూ.4500ల వరకు మాత్రమే వస్తున్నాయని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం 51 జీవోను తెచ్చి వివిధ కేటగిరీలను రద్దుచేసి మల్టీపర్పస్ పనివిధానం తీసుకొచ్చి కార్మికులకు పని భారం పెంచిందని ఆరోపించారు. ఏ పనైనా చేయాలని బలవంతంగా చేయించుకుంటూ కార్మికులను వేధింపులకు గురిచేస్తూ పనిలో నుంచి తొలగిస్తున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ సిబ్బందిలో అర్హులను పర్మినెంట్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పీఆర్‌సీ నిర్ణయం ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. వీరి సమస్యలను పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు.