తమిళి సై గవర్నర్ పదవికి అర్హురాలు కాదు.. మంత్రి KTR సెన్సేషనల్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2023-09-26 10:34:41.0  )
తమిళి సై గవర్నర్ పదవికి అర్హురాలు కాదు.. మంత్రి KTR సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళి సై నిరాకరించడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులనే ఎమ్మెల్సీలుగా కేబినెట్ సిఫార్సు చేసిందని.. గవర్నర్ మనసుతో ఆలోచించి ఉంటే తిరస్కరించేవారు కాదని అన్నారు. రాజకీయాల్లో ఉన్నవారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిపార్సు చేయవద్దని తమిళి సై అన్నారు.. మరీ తమిళి సై తెలంగాణ గవర్నర్ అయ్యే ఒక్కరోజు ముందు వరకు కూడా తమిళినాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారని గుర్తు చేశారు. ఆమెను గవర్నర్‌గా నియమించడం సర్కారియా కమిషన్‌ నిబంధనలకు విరుద్ధమని అన్నారు. గవర్నర్ తమిళి సై మోడీ ఎజెండాగా పని చేస్తున్నారని.. ఇప్పటికి ఆమె బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. గవర్నర్లు ప్రధాని మోడీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని.. ఒక్క తెలంగాణలోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని సీరియస్ అయ్యారు.

గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటిదని.. బ్రిటిష్‌కు చెందిన గవర్నర్ వ్యవస్థ దేశంలో అవసరమా అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలస పాలన చిహ్నామైన గవర్నర్ వ్యవస్థను ప్రధాన మోడీ ఎందుకు రద్దు చేయరని ప్రశ్నించారు. రాజకీయ నాయకులని ఎమ్మెల్సీ నామినేషన్లను తిరస్కరించిన తమిళి సై సౌందరాజన్.. బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా పని చేసినందుకు ఆమె సైతం గవర్నర్ పదవి అర్హురాలు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు అర్హులో.. ఎవరు అనర్హులో ప్రజలు తేలుస్తారన్నారు. మోడీ కూడా ప్రధాని పదవిని వైస్రాయ్‌గా మార్చుకుంటే బాగుంటుందని సెటైర్ వేశారు. రెండు జాతీయ పార్టీలైనా బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణపై పగబట్టాయన్నారు. జమిలీ ఎన్నికలు రాజకీయ జిమ్మిక్కు అని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి అడ్రస్ ఉండదని కేటీఆర్ ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed