ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులను అసెంబ్లీ లోకి తీసుకెళ్లండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

by Mahesh |   ( Updated:2024-07-16 11:30:36.0  )
ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులను అసెంబ్లీ లోకి తీసుకెళ్లండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సీరియస్ అయ్యారు. నగరంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన తమకు ప్రభుత్వ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, కళ్యాణ లక్ష్మి, బోనాల చెక్కుల పంపిన కార్యక్రమాలకు కనీసం సమాచారం ఇవ్వకుండా, కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను అసెంబ్లీలోకి అనుమతించాలని ఎమ్మెల్యే పద్మారావు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సెటైర్లు వేశారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ను కలిసేందుకు అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని అసెంబ్లీ మీడియా హాల్ లో ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Advertisement

Next Story