- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈటల బీసీల ముసుగులో ఉన్న రెడ్డి: T-కాంగ్రెస్ నేతలు ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీసీ ముసుగులోని రెడ్డి అని టీపీసీసీ వైస్‌ప్రెసిడెంట్ మల్లు రవి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..ఈటెల రాజేందర్ మాట్లాడిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉన్నదన్నారు. ‘అమ్మ మీద ఒట్టు, అయ్యా మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు ఏంది?అంటూ’ ఆయన మాట్లాడిన తీరు హిందు సంప్రదాయాలను, తల్లీ తండ్రులను చాలా కించపరిచినట్టు ఉన్నదన్నారు. భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని రాజకీయ వేదిక చేసి ఆ గుడి చుట్టూ రాజకీయాలు నడిపింది బీజేపీ అని మండిపడ్డారు. గతంలో యాదగిరిగుట్టలో బండి సంజయ్ తడిబట్టలతో ప్రమాణం చేసినపుడు ఆయనకు ఆత్మసాక్షి లేదా? అంటూ ప్రశ్నించారు. సీనియర్నాయకుడైన ఈటల రాజేందర్ఆధారాలు లేకుండా పార్టీ వ్యక్తిత్వన్ని కించపరిచేలా మాట్లాడటం సరైన విధానం కాదన్నారు.
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు పెద్దపీఠ వేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. గడిచిన 9 ఏళ్లుగా కేసీఆర్చేసిన అవినీతికి ఈటల రాజేందర్సపోర్టు చేశారంటూ ఆరోపించారు. ఇక డీకే అరుణకు రాజకీయ బిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, ఆమె కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నిక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ పైసలతోనే తొడిగిందని విమర్శించారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు పిచ్చి ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మీ దేవాలయానికి వచ్చి ప్రమాణం చేస్తే ఈటల పారిపోయాడన్నారు.
అద్దంకి దయాకర్మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కన్నీళ్లు పెట్టే వరకు తీసుకువచ్చిన ఈటల రాజేందర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పొగిడినప్పుడే బీఆర్ఎస్‌తో ఒప్పందం ఉన్నట్లు ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైందన్నారు. ఈటల మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన తప్పిదాలు, అవినీతిలపై బయటకు తీస్తామన్నారు. ఇక అమిత్ షా, మోడీలు ఐటెం సాంగ్‌లాగా తెలంగాణకు వచ్చి పోతుంటారన్నారు. వాళ్లను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
మాజీ ప్రభుత్వ విప్ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ.. ఈటల బీసీ అని బయటకు చెప్పుకుంటున్నా.. పట్టాదారు పాసు పుస్తకంలో రాజేందర్‌రెడ్డి అని ఉన్నదన్నారు. ఈటల ఫైనాన్స్మినిస్టర్గా ఉన్న సమయంలోనే మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయలో అవినీతి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వేం నరేందర్ రెడ్డి, భూపతిరెడ్డి నర్సారెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, అధికార ప్రతినిధులు సంకేపల్లి సుధీర్ రెడ్డి, మైనారిటీ నాయకులు ఫేహీం ఖురేషి తదితరులు పాల్గొన్నారు.