- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాముడి అక్షింతలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. KCRపై టీ-బీజేపీ సంచలన ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై ట్విట్టర్ వేదికగా టీ-బీజేపీ ఫైర్ అయింది. ‘హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడిపై అవమానకరంగా అహంకారపు వ్యాఖ్యలు.. మైనార్టీల మెప్పు కోసం రాజకీయ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు.’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు ‘అయోధ్య శ్రీ రామ పూజిత అక్షింతలు.. శ్రీ రామ మహా ప్రసాదంపై.. అహంకారంతో.. అహంభావంతో పోరంబోకు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్.. కోట్లాది మంది శ్రీరామ భక్తులకు క్షమాపణ చెప్పాలి.. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామున్ని అవమానిస్తూ.. ఒక వర్గం వారిని ప్రత్యేకంగా పొగుడుతూ.. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేసీఆర్.. నీ రాజకీయ పతనం ఇక శాశ్వతం’ అని రాసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఇక, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ రోడ్డు షోలో కేసీఆర్ మాట్లాడుతూ.. అక్షింతలు కలపాలే.. తీర్థం పుచ్చుకోవాలే.. పులిహోర ప్రసాదం తిని ఊరేగింపులు తీయ్యాలే అన్నారు. కాషాయ జెండాల ఊరేగింపులు మన కడుపు నింపుతాయా అని అన్నారు. అక్షింతలు కలిపి ఊరురా పంచి ఓట్లు దొబ్బాలే అన్న చందంగా వ్యవహరిస్తున్నారని బీజేపీని ఉద్దేశించి కేసీఆర్ పరోక్షంగా సెటైర్లు వేశారు.