కేసీఆర్ పాలన నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి

by Javid Pasha |
Kishan Reddy
X

దిశ, వెబ్ డెస్క్ : టీ బీజేపీ ప్రెసిడెంట్ జి.కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలన నుంచి రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. సీనియర్ నటి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జయసుధ శనివారం టీ బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు ముక్కలాట ఆడుతున్నాయని అన్నారు. ఆ మూడు పార్టీలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని, అందుకే బీజేపీలో చాలా మంది నేతలు చేరుతున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా మంది బీజేపీలో చేరారని, భవిష్యత్తులో మరింత మంది చేరుతారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.

Advertisement

Next Story

Most Viewed