- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలంపూర్, గోషామహల్‌పై వీడని సస్పెన్స్.. ఆశావహుల్లో టెన్షన్.. టెన్షన్!
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ మరో మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది. ఎన్నికలకు గడువు సమీపిస్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం ఇంకా సస్పెన్స్ పెట్టింది. మరో 37 రోజులు మాత్రమే ఉండటంతో కేడర్ లోనూ, ఆశావాహుల్లోనూ కొంత నైరాశ్యం నెలకొంది. గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాల్లో ఆశావాహులు ముందుకు వచ్చినప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం చోద్యం చూస్తుంది. ఆలం పూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం ను కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు బీఫాం ఇవ్వలేదు. మరో పక్కా ఆ టికెట్ ను విజేయుడు కు కన్ఫాం చేశారనే ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి అనుచరుడు కావడంతో విజేయుడుకు టికెట్ ఇప్పిస్తున్నారని తెలిసింది.
ప్రగతిభవన్, తెలంగాణ భవన్ చుట్టూ కీలక నేత ప్రదక్షిణలు..
తనకే ఆలంపూర్ టికెట్ కేటాయించాలని, బీఫాం ఇవ్వాలని కోరుతు ప్రతి రోజూ ప్రస్తుత ఎమ్మెల్యే అబ్రహం ప్రగతిభవన్, తెలంగాణ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావును సైతం కలుస్తున్నారని సమాచారం. అయినప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని సమాచారం.