- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు Supreme Court నోటీసులు
దిశ, డైనమిక్ బ్యూరో: విభజన చట్టం 2014 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ, కేంద్రాన్ని ప్రభుత్వాలను ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల ఆస్తుల పంపకాలపై ఏపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆస్తులను విభజించకపోవడం వల్ల తెలంగాణకు రూ.1.42 లక్షల కోట్ల విలువైన ఆస్తి చేకూరిందని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు 91 శాతం ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొంది. చట్టప్రకారం ఏపీకి రావాల్సిన ఆస్తులను తెలంగాణ పంచడం లేదు, అలాగే ఈ విషయంలో కేంద్రం సైతం జోక్యం చేసుకోవడం లేదని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ ఎం.ఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ అంశంలో కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ, కేంద్రానికి ఆరు వారాల గడువు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. రిజైన్డర్ దాఖలకు చేయడానికి ఏపీకి నాలుగు వారాల సమయం ఇచ్చింది. ఈ సందర్భంగా ఇలాంటి విషయాలపై ఈ కోర్టులో ఇతర అంశాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పగా అవి వ్యక్తిగత సంస్థలకు సంబంధించిన పిటిషన్లు అని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఈ విచారణకు తెలంగాణ, కేంద్రం తరపున న్యాయవాదులు హాజరుకాలేదు.
Also Read...