- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మోడీ నెక్స్ట్ కేబినెట్ లో మంత్రిగా సన్నీలియోన్'.. ధ్రువ్ రాథీని అడ్డుకునేందుకు బిగ్ స్కెచ్..(వీడియో వైరల్)
దిశ, డైనమిక్ బ్యూరో:రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం పూర్తిగా ఆవరించింది. రాజకీయ పార్టీలు, వ్యక్తులు తమ వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను బలమైన అస్త్రాలుగా ఉపయోగిస్తున్నాయి.ఈ క్రమంలో వాస్తవాల కంటే ఫేక్ న్యూస్ లు కుప్పలు తెప్పలుగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని కొందరు ధ్రువ్ రాథీ అనే యూట్యూబర్ ను నిలువరించేందుకు ఫేక్ ప్రచారం క్రియేట్ చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. ధ్రువ్ రాథీ గత కొంత కాలంగా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణలోకి బీజేపీ మద్దతు దారులు ఏర్పాటు చేసుకున్న ఓ కార్యక్రమంలో ఈ ధ్రువ్ రాథీని నిలువరించేందుకు ఏం చేయాలనే విషయం ప్రస్తావనకు వచ్చింది. ధ్రువ్ రాథీ అనే వ్యక్తి వీడియోలకు లక్షల్లో వ్యూవ్స్ వస్తున్నాయి.మనమందరం కలిసి ఆయన వీడియోలను ఆపాలి. యూట్యూబ్ లో లేకుండా చేయాలి దీని కోసం ఏం చేయాలని ఓ వ్యక్తి అడుగగా దానికి మరో వ్యక్తి బదులిస్తూ.. ధ్రువ్ రాథీని మనం ఆపలేం. ఆయన వీడియోలు, వాదనలు యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారమే ఉంటున్నాయని రాజకీయంగానే కాకుండా రాజ్యాంగబద్దంగా కరెక్ట్ గా వ్యవహరిస్తున్నాడని అందువల్ల అతన్ని ఎలా టార్గెట్ చేస్తామనే కంటే ఆయన వాదనకు ఎలా కౌంటర్ ఇస్తామనే దానిపైనే మన గోల్ పెట్టుకోవాలని బదులిచ్చాడు.
Read More..
అమెరికాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు భారత సంతతి విద్యార్థులు మృతి
ఇక మరో వ్యక్తి మాట్లాడుతూ..ధ్రువ్ రాథీని ఫేస్ బుస్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా కమెడియన్ ను చేస్తే బాగుంటుంది. ఎలా అంటే సన్ని లియోన్ ను నరేంద్ర మోడీ వచ్చే కేబినెట్ లో మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రిగా చేస్తున్నారని ధ్రువ్ రాథీ చెప్పాడని ప్రచారం చేయాలి.ఇలాంటి పోస్టులు కంటిన్యూగా పెడుతుంటే అతడు ప్రజల్లో జోకర్ గా మారుతాడు.అని మరో వ్యక్తి బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాదనను ప్రతివాదనతో అడ్డుకోకుండా ఫేక్ ప్రచారంతో తప్పుదోవా పట్టించాలని ప్లాన్ చేస్తున్నారంటే పెద్ద స్కెచ్చే అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రసుతం ఈ వీడియో జాతీయ స్థాయిలో వైరల్ గా మారింది.