- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తల్లిదండ్రులే పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలి’
హైదరాబాద్: ‘7H’ స్పోర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికారిత సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎల్బీ స్టేడియంలోని చైర్మన్ కార్యాలయంలో ఆయన పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. క్రీడలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని తెలిపారు. పిల్లలు క్రీడలపై ఆసక్తి కలిగించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. 7H స్పోర్ట్స్ సంస్థ వ్యవస్థాపకులు వెంకటేష్ సమ్మర్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. యువతను క్రీడా మైదానాల్లోకి తీసుకొచ్చే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద స్థాయిలో జరగాలన్నారు.
7H స్పోర్ట్స్ సంస్థ వ్యవస్థాపకులు వెంకటేష్మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలని వారిలో ఉన్న క్రీడా ప్రతిభకు వేదిక అందించాలని "సమ్మర్ స్పోర్ట్స్ మీట్" ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో బాడ్మింటన్, క్రికెట్, స్విమ్మింగ్, స్కేటింగ్, టేబుల్ టెన్నిస్ క్రీడలు ఉంటాయన్నారు. 10–17 ఏండ్ల వయస్సులోపు వారు ఎవరైనా ఆయా క్రీడలలో పాల్గొనేలా టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టోర్నమెంట్ఏప్రిల్, మే, జూన్‌లలో నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నామన్నారు. పూర్తి వివరాలకు 7396386214, 9347777794 నంబర్లలో సంప్రదించవచ్చని చెప్పారు.