- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister KTR తప్పు చేశాడు.. సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేస్తూ ఇటీవల వరుస లేఖలు రాస్తోన్న సుఖేష్ చంద్ర శేఖర్ మంత్రి కేటీఆర్‌కు తాజాగా మరో లేఖ రాశారు. ఇటీవల కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు కౌంటర్‌గా సుఖేష్ చంద్రశేఖర్ ఈ లేఖను రాశారు. కవిత, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీపై సీబీఐ, తెలంగాణ గవర్నర్‌కు తాను ఫిర్యాదు చేసినట్లు లెటర్‌లో పేర్కొన్నాడు. వారిపై ఫిర్యాదు చేయడంతో కేటీఆర్ ఆయన అనుచరులతో తనపై ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖలో ఫిర్యాదు చేశారు.
కేటీఆర్ లీగల్ నోటీసులు పంపి.. కేసులు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నాడు. మంత్రి కేటీఆర్ తప్పు చేశాడు కాబట్టే నాపై ఆయన అనుచరులను ఉసిగొలుపుతున్నాడని ఆరోపించాడు. దీంతో ఇప్పటి వరకు కేటీఆర్, కవితలపై తాను చేసిన ఫిర్యాదులను సీబీఐ వెంటనే పరిగణనలోకి తీసుకుని అత్యవసర విచారణ చేపట్టాలంటూ లేఖలో సుఖేష్ విజ్ఞప్తి చేశారు. కాగా, మనీలాండరింగ్ ఆరోపణల కేసు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు.