- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం రేవంత్ అమెరికా టూర్ సక్సెస్: కాంగ్రెస్ ఎంపీలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాడని కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ అమెరికా టూర్ సక్సెస్ అయిందన్నారు. చాలా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పై సీఎం ప్రత్యేక ఫోకస్ పెట్టారన్నారు. రాష్ట్ర డెవలప్ మెంట్ కోసం స్వయంగా సీఎం వెళ్లి కంపెనీలను ఆకర్షితం చేస్తున్నారన్నారు. పండేళ్లలో కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి కదల్లేదన్నారు. బీఆర్ఎస్ విమర్శల వెనక విషం చిమ్మే కుట్ర ఉన్నదన్నారు.
వివిధ కంపెనీలు పెట్టుబడిపెట్టేందుకు ఇప్పటికే ఒప్పందాలు పూర్తి చేసుకోగా, మరి కొన్ని కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత స్వయంగా సీఎం విదేశీ పర్యటనకు వెళ్లి పెట్టుబడులు ఆహ్వానించడం ఇదే మొదటి సారి అని వెల్లడించారు. పదేళ్ల పాటు కేసీఆర్ పామ్ హౌస్ నుంచి కాలు బయట పెట్టనప్పుడు, ఇప్పుడు తమను విమర్శించే నాయకులు ఎక్కడికి వెళ్లారు? అని ప్రశ్నించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో ఐటీ మంత్రి హోదాలో కేటీఆర్ విదేశాల్లో జల్సా చేసి వచ్చాడన్నారు. ఐటీ శాఖకు చెందిన అధికారులు మాత్రమే కేటీఆర్ తో విదేశాలకు వెళ్లారన్నారు. తెలంగాణకు తానే ముఖ్యమంత్రి అన్న బిల్డప్ తో కేటీఆర్ విదేశాల్లో షో చేసి వచ్చాడన్నారు. కేటీఆర్ పదేళ్ల కాలంలో విదేశాలకు వెళ్లి తెచ్చిన పెట్టుబడులపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఇప్పుడు పెట్టుబడుల కోసం స్వయంగా ముఖ్యమంత్రే అమెరికా వెళ్లడం గొప్ప విషయమని వెల్లడించారు. సీఎం అధికారిక పర్యటనలో ఎక్కడా రహస్యం లేదని నొక్కి చెప్పారు. సీఎం పేషీ అధికారులతో పాటు సీఎస్ కూడా పర్యటనలో ఉన్నారన్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాగా, హైదరాబాద్ లో కొత్త సెంటర్ ను తీసుకురానున్నట్లు హామీ ఇచ్చారన్నారు. 10 లక్షల చదరపు అడుగుల్లో రాబోయే సెంటర్ వల్ల దాదాపు 15 వేల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇక వీ హబ్ లో వాల్స్ కర్రా హెూల్డింగ్స్ (5 మిలియన్ డాలర్లు) రూ. 42 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. వచ్చే ఐదేళ్లలో స్టార్టప్ లో ఈ కంపెనీ రూ. 839 కోట్లు పెట్టుబడి పెట్టనున్నదన్నారు. హైదరాబాద్ లో ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ను నెలకొల్పనున్నదన్నారు. ఈ సెంటర్ లో 1000 మంది ఉద్యోగులు పనిచేయబోతున్నారని వెల్లడించారు. ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ...టెక్నాలజీ, సర్వీస్ సోల్యూషన్స్ లో పేరున్న ఆర్సీసియం కంపెనీ తెలంగాణ లో కార్యక్రమాలు విస్తరించబోతున్నదన్నారు. హైదరాబాద్ లో మొదటి ఆఫీసును విస్తరిస్తుందన్నారు. దీనిలో దాదాపు 500 మంది సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారన్నారు. హెల్త్ కేర్ రంగంలో పేరుగాంచిన హెచ్సీఏ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు కాబోతుందన్నారు. తెలంగాణలో 2జీ బయో ఇథనాల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతున్నామని, ఇందు కోసం రూ.1000 కోట్ల పెట్టుబడి రానున్నాయన్నారు. చాలా కంపెనీలు ప్రభుత్వ ప్రభుత్వంపై పాజిటివ్ గా స్పందించి పెట్టుబడులు పెట్టేందుకు ఆకర్షితులవుతున్నారన్నారు. కొత్త ప్రభుత్వ విధానాలు నచ్చి ముందుకు రాబోతున్నారని వెల్లడించారు.