- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నకిరేకల్ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలి’
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ నాయకుల భార్యలను బీఆర్ఎస్ నాయకులు అందరూ ముద్దు పెట్టుకుంటారు.. అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అసభ్యంగా మాట్లాడాటాన్ని నిరసిస్తూ అతని మీద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా డిమాండ్ చేసింది. మంగళవారం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి ఆధ్వర్యంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ రకమైన పద జాలం వాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య శత్రుత్వం పెంచుతున్నారని గీతామూర్తి తెలిపారు.
మహిళల మీద ఇలాంటి అసహ్య పదాలు సమాజానికి అగౌరవం అని, మహిళల ఆత్మ గౌరవాన్ని మంట పెడుతున్న ఈ శాసన సభ్యున్ని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ విషయం మీద వెంటనే చర్యలు తీసుకుంటామని మహిళా మోర్చా టీంకు హామీ ఇచ్చారని తెలిపారు. జాతీయ మహిళా కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కల్యాణం గీతా రాణి, కార్యదర్శి శ్యామల, ఉపాధ్యక్షురాలు డాక్టర్ మాలతి తదితరులు పాల్గొన్నారు.