- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వీధి కుక్కల బీభత్సం
దిశ, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వీధి కుక్కల దాడులు తగ్గడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాల్లో శుక్రవారం వీధి కుక్కలు దాడులు చేయడంతో పలువురు గాయపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన బొల్లే ఇస్సాకు, రూపల కూతురు చరిష్మా(4)పై వీధి కుక్కలు దాడి చేశాయి. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో చరిష్మా తలకు తీవ్రమైన గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్లో బైకుపై వెళుతున్న దంపతులపై వీధి కుక్కులు దాడి చేశాయి. ఈ ఘటనలో దంపతులిద్దరూ గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో పాఠశాలలు కూడా ఉన్నందున మునిసిపాలిటీ యంత్రాంగం వీధి కుక్కలను కట్టడి చేసేందుకు చొరవ చూపాలని కోరుతున్నారు. హైదరాబాద్లోని అంబర్పేట్లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ఘటన మరువకముందే రాష్ట్రంలో పలుచోట్ల వీధి కుక్కలు హల్చల్ చేయడం కలకలం రేపుతోంది.