రోడ్డుపైకి చెట్లు ఎక్కే వింత చేపలు.. పాకుతూ పోతున్నాయ్! వీడియో వైరల్

by Ramesh N |
రోడ్డుపైకి చెట్లు ఎక్కే వింత చేపలు.. పాకుతూ పోతున్నాయ్! వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత రెండు రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వర్షాలకు పాములు, కప్పలు రోడ్లపైకి రావడం సర్వ సాధారణం. మరోవైపు ఆకాశం నుంచి చేపలు కూడా పడటం కూడా చూసే ఉంటారు. కానీ తాజాగా కురిసిన వర్షాలకు రెండు వింత చేపలు రోడ్డుపైకి వచ్చి పాకుతూ కనిపించాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెంటపల్లి మండలంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే రోడ్డు పాకుతున్న ఒక రకమైన చేపలను చూడడానికి స్థానికులు గుంపులుగా వచ్చారు. ఆ రెండు చేపలు రోడ్డుపై పాకుతూ చూసి ఆశ్చర్యపడ్డారు.

చేపల వింత ప్రవర్తన పై మత్సశాఖ ఏడీ లక్ష్మప్పను తాజాగా వివరణ కోరగా.. ఈ రకం చేపలు నదులు, చెరువులు, కుంటలు, వాగుల్లో జీవిస్తుందని వెల్లడించారు. ఈ చేపను గురక చేప (ఎక్కే చేప) అని అంటారని వివరించారు. దీని శాస్త్రీయ నామం అనబాస్ టెస్టుడ్యూనియస్ అని తెలిపారు. ఈ చేపలు సుమారు 25 సెంటీ మీటర్లు పెరుగుతాయన్నారు. ఈ చేప రంపపు పండ్ల ద్వారా నేలపై పాకుతూంటాయని, చెట్లను కూడా ఎక్కుతాయని వివరించారు. అయితే మత్స్యకారులు ఈ చేపలను చెరువుల్లో ప్రత్యేకంగా పెంచుతారని స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed