- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SC classification: ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలు ముందుకు రావాలి: మందకృష్ణ మాదిగ
దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందునా డిమాండ్ ఉన్న రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు వెంటనే వర్గీకరణ అమలు పరిచేలా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచన చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్లు చెప్పారు. తన విజ్ఞప్తిపై ప్రధాని సానుకూలంగా స్పందించి నిర్దిష్టమైన హామీ ఇచ్చారని వెల్లడించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందని, వర్గీకరణ సాకారంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి పాత్ర ఎంతో ఉందని అన్నారు. గతంలో అన్ని పార్టీలు వర్గీకరణకు సానుకూలంగా ఉన్నామని మేనిఫెస్టోలో ప్రకటిచినా అమలు చేసే విషయంలో వెనుకడుగు వేశాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రాలు వేగంగా ముందుకు రావాలన్నారు. వర్గీకరణకు సమర్ధిస్తూ తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ప్రతి న్యాయమూర్తికి పేరుపేరునా ధన్యవాదాలు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటినా రిజర్వేషన్ల ఫలాలు చాలా కుటుంబాలకు అందలేదన్నారు.