రాష్ట్ర అవతరణ వేడుకలు.. తెలుగులో మోడీ స్పెషల్ ట్వీట్

by Sathputhe Rajesh |
రాష్ట్ర అవతరణ వేడుకలు.. తెలుగులో మోడీ స్పెషల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతి వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను.’ అని ప్రధాని మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. అయితే ప్రధాని మోడీ ట్వీట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతోంది. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నుంచి తెలంగాణలో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు గాను ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

Advertisement

Next Story