- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గవర్నర్ పదవికి తమిళిసై ఏమాత్రం అర్హురాలు కాదు’
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గవర్నర్ తమిళిసైపై రాష్ట్ర రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో గవర్నర్ చేస్తోన్న వ్యాఖ్యలు కేవలం ప్రచారం మత్రమే అని విమర్శించారు. గవర్నర్ పదవికి తమిళిసై ఏమాత్రం అర్హురాలు కాదని ఎద్దేవా చేశారు. కాగా, ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ వద్ద అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదముద్ర వేసిన 8 బిల్లుల్లో ఒక్క బిల్లును మాత్రమే గవర్నర్ ఆమోదించారు. ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు వెంటనే ఆమోదముద్ర వేసిన గవర్నర్ తమిళిసై మరో మూడు బిల్లులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తం పది బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. దీనిపై గతంలో తెలంగాణ మంత్రులు విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో గవర్నర్ వ్యవహారంపై రాష్ట్ర బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.