- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గృహ జ్యోతి కి లైన్ క్లియర్.. స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గృహజ్యోతి’ స్కీమ్‌కు స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదిం తెలిపింది.పేదలకు నెలకు 200 యూనిట్ల మేర విద్యుత్ వినియోగానికి ప్రభుత్వమే సబ్సిడీ చెల్లిస్తున్నందున జీలో బిల్ జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ స్కీమ్ కింద లబ్ధి పొందుతున్నది పేదలే అయినందున ప్రస్తుతం ఎవరి పేరు మీద సర్వీస్ కనెక్షన్ ఉన్నదో వారి పేర్లతోనే కంటిన్యూ చేయాలని, పేర్లలో మార్పులు చేయరాదని డిస్కంలకు కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు. జీరో బిల్లు కింద ఎంత మంది లబ్ధి పొందుతున్నారో, ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో ఎంత రావాల్సి ఉంటుందో ప్రతి నెల 20వ తేదీ కల్లా వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని స్పష్టం చేసింది. ఈ స్కీమ్ కారణంగా రెండు డిస్కంలు ఎంత మందికి ప్రయోజనం కలిగిస్తున్నాయో స్పష్టమైన రిపోర్టులను అందజేయాలని ఆదేశించింది.
ప్రభుత్వం జీరో బిల్ స్కీమ్‌ను అమలు చేస్తున్నందువల్ల ఫ్రంట్ లోడ్ లేదా బ్యాక్ లోడ్ విషయంలో స్పష్టత ఉండాలని పేర్కొన్నది. ఒకవేళ ఫ్రంట్ లోడ్ సిస్టమ్‌ను అమలు చేసేటట్లయితే బిల్లింగ్ చేయడానికి ముందే అంచనాతో ప్రభుత్వం అడ్వాన్సు పేమెంట్ రూపంలో డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాక్ లోడ్ విధానం అయినట్లయితే వినియోగదారులు ముందుగా పూర్తి స్థాయిలో బిల్లు చెల్లించిన తర్వాత ప్రభుత్వం రీఇంబర్స్ పద్ధతిలో వారికి సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తుంది. డిస్కంలకు ప్రభుత్వం సబ్సిడీని చెల్లించనట్లయితే జీరో బిల్ విధానం అమలు కావడానికి వీల్లేదని కమిషన్ స్పష్టం చేసింది. కానీ ప్రభుత్వం ఈ నెల 14న జారీ చేసిన లేఖ ప్రకారం విద్యుత్ చట్టంలోని సెక్షన్ 65 ప్రకారం గృహజ్యోతి స్కీమ్‌కు అడ్వాన్సు పద్ధతిలో ప్రభుత్వం ముందుగానే డిస్కంలకు పేమెంట్ చేయాలని పేర్కొన్నది.