- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా
దిశ, ప్రతినిధి నిర్మల్: అధికార భారత్ రాష్ట్ర సమితి పార్టీకి (BRS) సీనియర్ నేత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు కే శ్రీహరి రావు రాజీనామా చేశారు. కొంతకాలంగా ఊగిసలాటలో ఉన్న శ్రీహరి రావు ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ తనకు అన్యాయం చేసిందని.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కారణంగా నిర్మల్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని ఆరోపించారు.
కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటానని చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సొంత ఆస్తులను పెంచుకోవడానికి తన అధికారాన్ని వాడుకున్నారని తీవ్రంగా విమర్శించారు. పదవులు శాశ్వతం కాదని.. ప్రజలే శాశ్వతం అని గుర్తించాలని సూచించారు. ప్రజా కంటక పాలనను సమాజం భరించబోదని.. త్వరలోనే నిర్మల్ నియోజకవర్గం ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పబోతున్నారని వ్యాఖ్యానించారు. కాగా, ఆయన అధికార పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ‘‘దిశ’’ ముందే చెప్పింది.
.Also Read..
ధరణి వద్దన్న వాళ్లకు మీరే సమాధానం చెప్పాలి: సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు