క్రీడల్లో రాణిస్తే ఏరంగంలోనైనా రాణించొచ్చు.. సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్

by Javid Pasha |
క్రీడల్లో రాణిస్తే ఏరంగంలోనైనా రాణించొచ్చు.. సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : క్రీడల్లో రాణించిన వారు ఏ రంగంలోనైనా రాణించొచ్చని స్పోర్ట్స్ అథారిటా రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అన్నారు. యూపీఎస్సీలో ఆల్ ఇండియా 51 ర్యాంకు సాధించిన సైక్లింగ్ క్రీడాకారుడు మధుసూదన్ రెడ్డిని శుక్రవారం ఓయూ పరిధిలోని సైక్లింగ్ వేలో డ్రమ్ స్టేడియంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ మానసిక, శారీరక దారుఢ్యానికి క్రీడలు దోహదపడ్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగనాన్ని ఏర్పాటు చేస్తుందని, నియోజకవర్గంలో మినీ స్టేడియంల నిర్మాణం చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరికి విద్యతోపాటు క్రీడలు అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ సుధాకర్ రావు, సిబ్బంది, కోచ్ లు, సైక్లింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed