యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు

by M.Rajitha |
యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె- కేశముద్రం మధ్య రైల్వే ట్రాక్ వరదలకు పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో ఈ రూట్లో వెళ్ళే అన్ని రైళ్లను ఆపివేశారు. ఐదు చోట్ల ట్రాక్ తీవ్రంగా పాడవగా, ఇప్పటికే కొంతమేరకు పనులు పూర్తయ్యాయి. మరో రెండు చోట్ల రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు, మరో రెండు మూడు రోజుల్లో ట్రాక్ ను అందుబాటులోకి తీసుకు వస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. కాగా ఈ రూట్లో వెళ్ళే 108 రైళ్లను మంగళవారం, 88 రైళ్లను బుధవారం పూర్తిగా రద్దు చేశారు. మరికొన్నిటిని దారి మళ్లించారు. మొత్తంగా దక్షిణ మధ్య రైల్వే 560 రైళ్లను రద్దు చేయగా, మరో 18 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 185 రైళ్లను రూటు మార్చి నడుపుతోంది.

Next Story

Most Viewed