ప్రతివారం రోడ్ల వర్క్ ప్రోగ్రెస్ పరిశీలిస్తా: మంత్రి ప్రశాంత్ రెడ్డి

by Satheesh |
ప్రతివారం రోడ్ల వర్క్ ప్రోగ్రెస్ పరిశీలిస్తా: మంత్రి ప్రశాంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు పనులకు 60 వర్క్ ఏజెన్సీలు పని చేస్తున్నాయని, ప్రతీ ఏజన్సీతో క్షేత్ర స్థాయిలో సమీక్షించి నిర్ణీత గడువులోగా ప్రణాళిక ప్రకారం 45 రోజుల్లో అన్ని పనులు పూర్తి అయ్యేలా చూడాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతివారం తానే స్వయంగా రోడ్ల వర్క్ ప్రోగ్రెస్ పరిశీలిస్తానని పేర్కొన్నారు. సోమవారం డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ 5వ అంతస్తులోని ఆర్ అండ్ బీ శాఖ కాన్ఫరెన్స్ హాల్లో ఆ శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాల వల్ల డ్యామేజ్ అయిన 1172 పీరియాడికల్ రెన్యువల్ రోడ్ల మరమ్మతుల పనుల కోసం రూ.2858 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.

దీనిపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారని.. విధించిన నిర్ణీత గడువులోగా ప్రణాళిక ప్రకారం పనులు శరవేగంగా పూర్తి కావాలన్నారు. ఇప్పటికే రూ.518 కోట్లతో 1393 కి. మి పొడవు గల రోడ్ల మరమ్మతులు పూర్తి చేశామని, 1,223 కోట్ల రూపాయల విలువ గల 455 రోడ్ వర్క్స్ మొత్తం 2,700 కి. మీ వచ్చే 45 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలోఎమ్మెల్యేలు జాజుల సురేందర్, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆర్ అండ్ బీ సెక్రెటరీ శ్రీనివాస రాజు, ఈఎన్సీ రవీందర్ రావు, డీసీ దివాకర్, ఎస్.ఈ వసంత్ నాయక్, ఆర్ అండ్ బీ అధికారులు పాల్గొన్నారు

Advertisement

Next Story