- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయ్యా కొడుకులు పాలిటిక్స్‌లో బీజీ.. నిజామాబాద్ ఘటనపై ఏపీ నేత రియాక్షన్!
దిశ, డైనమిక్ బ్యూరో : కేసీఆర్, కేటీఆర్ లపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలోని ప్రభుత్వాసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేక రోగులకు అవస్థలు పడుతుంటే సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ మాత్రం రాజకీయ సమావేశాలతో బీజీగా ఉంటున్నారని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్రెచర్ అందుబాటులో లేక నడువలేని స్థితిలో ఉన్న రోగిని అతడి బంధువులు కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటనపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఇది నిజంగా సిగ్గుచేటు ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా తెలంగాణ అన్ని రంగాల్లో ఏపీ కంటే అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని ఇటీవల రాష్ట్ర మంత్రులు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారటం రాజకీయంగా బీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితిగా మారింది. నిజామాబాద్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకనైనా పాలిటిక్స్ పక్కన పెట్టి పరిపాలనపై దృష్టి సారించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరైతే విశాఖ స్టీల్ ఫ్లాంట్ విషయం పక్కన పెట్టి ముందు తెలంగాణలోని ఆసుపత్రులను బాగుచేయించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ మోడల్ పేరుతో జాతీయ రాజకీయాలు చేయాలని భావిస్తున్న కేసీఆర్ కు తాజా పరిమామం పార్టీ పరువు అప్రతిష్టపాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి: చంద్రబాబు, లోకేష్‌కు దళితులంటే చులకన: మంత్రి కాకాణి