Smugling: గచ్చిబౌలిలో భారీగా గంజాయి తరలిస్తున్న కారు పట్టివేత

by Ramesh Goud |
Smugling: గచ్చిబౌలిలో భారీగా గంజాయి తరలిస్తున్న కారు పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: గచ్చిబౌలి(Gacchibowli)లో భారీగా గంజాయి(Ganja) పట్టుబడింది. కారు(Car)లో తరలిస్తున్న 20 కిలోల గంజాయిని తరలిస్తున్న కారును శంషాబాద్ డీటీఎస్ అధికారులు(Shamshabad DTS Police) పట్టుకున్నారు. టాటా విస్టా కారు(TATA Vista Car)లో గంజాయి తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు నానాక్‌రామ్ గూడ(Nanak Ram Guda)లో ఓ కారును పట్టుకున్నారు. అందులో తనికీలు నిర్వహించగా.. భారీగా గంజాయి బయటపడింది. గంజాయిని కారు డిక్కీ కింద డూమ్ లలో దాచి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. కారు డూమ్‌లను తొలగించి చూడగా.. అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల గంజాయి ప్యాకెట్ల రూపంలో బయటపడింది. పట్టుబడిన గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితుడు బిక్రమ్ తప్పించుకొని పారిపోయినట్లు చెబుతున్నారు. అలాగే గంజాయి తరలించేందుకు ఉపయోగించిన టాటా విస్టా కారును సీజ్ చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed