స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ విద్యార్ధులకు వరం : టీపీసీసీ స్పోక్స్ పర్సన్ దయాకర్

by M.Rajitha |
స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ విద్యార్ధులకు వరం : టీపీసీసీ స్పోక్స్ పర్సన్ దయాకర్
X

దిశ, వెబ్ డెస్క్ : స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ విద్యార్ధులకు వరం అని టీపీసీసీ స్పోక్స్ పర్సన్ దయాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్ధులకు నైపుణ్యం పెరిగి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. స్కిల్ యూనివర్సిటీకి టెక్ మహేంద్రా ఆనంద్ ను చైర్మన్ గా నియమించడం మంచి పరిణామం అన్నారు. దీని ద్వారా ప్లేస్మెంట్ లు భారీగా పెరుగుతాయన్నారు. ఇలాంటి విశ్వవిద్యాలయాలు మార్కెట్ లో అధిక ఉద్యోగ సామర్ధ్యాన్ని, ఉపాధి కలిగిన కోర్సులను అందిస్తాయన్నారు. స్కిల్ యూనివర్సిటీలు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ కు అనుగుణంగా డిగ్రీలు ప్రధానం చేస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్ కు బంగారు బాటలు వేసేందుకు చొరవ తీసుకున్నదన్నారు. ముఖ్యంగా గ్రామీణ విద్యార్ధులకు స్కిల్ యూనివర్సిటీతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. రాజకీయాలకు అతీతంగా దీన్ని స్వాగతించాల్సి ఉంటుందన్నారు.

Next Story

Most Viewed