జానీ మాస్టర్ కేసులో కోర్టు కీలక నిర్ణయం

by M.Rajitha |   ( Updated:2024-09-24 10:14:04.0  )
జానీ మాస్టర్ కేసులో కోర్టు కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధించిన కేసులో టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johny Master) అరెస్టయిన విషయం తెలిసిందే. గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్(Hyderabad) కు తీసుకు వచ్చిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. అయితే ఈ కేసులో విచారించేందుకు కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేయగా.. అది నేడు విచారణకు వచ్చింది. పిటిషనర్ వాదనలు విన్న కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. కాగా ఈ కేసులో జానీ మాస్టర్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ కూడా రేపు విచారణకు రానుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాను మైనర్ గా ఉన్నప్పటి నుండి తనపై లైంగిక దాడికి పాల్పడుతూ.. సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తున్నాడని, తనని చంపేస్తా అని బెదిరిస్తున్నాడని జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా పని చేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో, రేప్ వంటి పలు కేసులు నమోదు చేసిన పోలీసులు.. గోవాలో ఉన్న జానీ మాస్టర్ ను అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకు వచ్చారు. కోర్టు జానీ మాస్టర్ ను కస్టడీకి ఇస్తే.. సంచలన నిజాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story