బిగ్ బ్రేకింగ్: TSPSC పేపర్ల లీకేజీ కేసులో రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు

by Satheesh |   ( Updated:2023-05-01 05:25:15.0  )
Vishnuvardhan Reddy Invites Congress Senior Leaders Opposing to Revanth Reddy For Lunch
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. పరీక్షలకు ముందే పేపర్లు లీక్ కావడంతో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు పరీక్షలను రద్దు చేసింది. ఈ పేపర్ల లీక్‌కు పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పేపర్ల లీక్ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు అప్పగించింది. ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని సిట్ బృందం రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేసింది.

పేపర్ లీక్‌కు పాల్పడిన నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తోంది. ఇదిలా ఉండగానే.. పలువురు రాజకీయ నేతలు టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంపై ఆరోపణలు చేస్తోన్న వారికి సిట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీ కేసులో వారు చేస్తోన్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. వారి వద్ద ఉన్న సమాచారాన్ని తమకు తెలియజేయాలని సిట్ నోటీసుల్లో కోరింది.

ఇందులో భాగంగా పేపర్ల లీక్ వెనుక కేటీఆర్, ఆయన పీఏ ఉన్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేస్తోన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు రాజకీయ నాయకులు సిట్ నోటీసులు జారీ చేసింది. పేపర్ల లీక్‌పై రేవంత్ రెడ్డి వద్ద ఉన్న సమాచారాన్ని తమకు ఇవ్వాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇక, గ్రూప్ 1 పేపర్ లీక్ వెనుక మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి ఉన్నాడని.. కేటీఆర్ పీఏ గ్రామంలో వందమంది అభ్యర్థులకు గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో వందకు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సిట్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ ఆధారాలు సమర్పించాలని కోరింది.

Read more:

సిట్‌కు భయపడేదే లేదు: నోటీసులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed