- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శిరీష హత్య కేసు: వీడిన మిస్టరీ
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సంచలనం సృష్టించిన శిరీష హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమె బావ తన స్నేహితునితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. ఇంటి పనుల విషయమై ఇటీవల శిరీష కుటుంబ సభ్యులతో గొడవ పడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె బావ అనిల్ ఇంటికి వచ్చి శిరీషను కోప్పడి చెయ్యి కూడా చేసుకున్నాడు. దాంతో శిరీష అతని సెల్ ఫోన్ లాక్కొని పగులగొట్టింది.
దాంతో అనిల్ ఆమె ఫోన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భార్యతో కలిసి రాత్రికి మరోసారి శిరీష ఇంటికి వచ్చాడు. అప్పుడు రెండోసారి గొడవ జరిగింది. అదేరోజు రాత్రి కనిపించకుండా పోయిన శిరీష మరుసటి రోజు దారుణ హత్యకు గురై కనిపించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు జరిపిన పోలీసులు తాజాగా శిరీష బావ అనిల్ తన స్నేహితునితో కలిసి ఈ హత్య చేసినట్టు నిర్ధారించుకున్నారని సమాచారం. బీరు సీసా పగులగొట్టి దాంతో శిరీష కళ్లల్లో పొడిచి చేతి నరాలు కోసి చంపినట్టు విచారణలో వెళ్లడయినట్టు తెలిసింది.