- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదంలో సింగర్ మంగ్లీ (Mangli Singer).. సోషల్ మీడియాలో ట్రోల్స్
దిశ, డైనమిక్ బ్యూరో: సింగర్ మంగ్లీ.. తెలుగు సంగీత ప్రియులకు ఈమె సుపరిచితురాలు. తెలుగు పండగలు వస్తున్నాయంటే తనదైన పాటలతో అందమైన డ్యాన్స్ తో పండగ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా మంగ్లీ రకరకాల పాటలను విడుదల చేస్తూ వస్తోంది. తెలంగాణ యాసలో ఆమె చేసే సందడి ప్రజల్లోకి త్వరగా చేరేలా చేసింది. అలాంటి మంగ్లీ తాజాగా మరోసారి చర్చగా మారింది. ఈసారి కొంత మంది ఆమె చర్యలు వ్యతిరేకిస్తుంటే మరి కోంత మంది ఆమె చేసిన దాంట్లో తప్పేముందని సమర్ధిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
మంగ్లీ ముస్లిం దర్గాను సందర్శించి అక్కడ ప్రార్థనలు చేస్తున్న ఫొటోలను ఓ మహిళ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈఫొటోలను షేర్ చేస్తూ 'హిందువులు ఇలాంటి పనులు మానుకుంటే మంచింది. ముస్లింలకు ఉన్న పాటి కమిట్ మెంట్ మనకు లేకపోవడం వల్లనే వాళ్లకు మనమీద చిన్నచూపు. తప్పు అబ్దుల్లాది కాదు. ఇలాంటి సెక్యులర్ హిందువులది. వాళ్లు గుడికి రానప్పుడు నీకెందుకు దర్గాలు?' అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టును సింగర్ మంగ్లీకి ట్యాగ్ కూడా చేసింది. దీనిపై నెటిజన్లు భిన్నరీతుల్లో స్పందిస్తున్నారు. మంగ్లీని తప్పుపడుతున్న వారు కొందరైతే ఆమె చేసిందాంట్లో తప్పేమిలేదని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. విశ్వాసం అనేది ఆమె వ్యక్తిగతమైనది. ఎవరిని విశ్వసించాలో కూడా మీరే చెప్తారా? మంగ్లీ చేసింది తప్పయితే మరి ప్రధాని నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగీ, మరి కొంత మంది బీజేపీ నేతలు దర్గాలను సందర్శించడం సరైనదేనా అంటూ వారు దర్గాలను సందర్శించిన ఫొటోలు షేర్ చేస్తున్నారు.
కాయిన్‌కు రెండు వైపులు ఉంటాయని, దాన్ని కొందరు ఓ కోణంలో చూస్తే ఇంకొందరు మరో కోణంలో చూస్తుంటారని అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లిమా (భిక్ష)అన్నదానం చేసి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా మంగ్లీని ఇప్పటి వరకు అనే వివాదాల్లోకి లాగిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలోని బోనాల ఉత్సవాలపై మంగ్లీ పాడిన పాట సైతం వివాదాస్పదం అయింది. ఆ సందర్భంలోనూ మంగ్లీని సమర్ధించిన వారు, విమర్శించిన వారు ఉన్నారు. తాజాగా దర్గాకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించిన మంగ్లీపై మరోసారి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఇష్యూపై మంగ్లీ ఎలా రియాక్ట్ అవుతారనేది ఇంట్రెస్టింగా మారింది.
హిందువులు ఇలాంటి సి'గ్గు, శ'రం, మాన0, అభిమాన0 లేని పనులు చేసుడు మానుకుంటే మంచిది.
— Mounika Sunkara (@mounikasunkaras) November 17, 2022
వాళ్ళకున్న పాటి Commitment మనకు లేకపోవటం వల్లనే వాళ్లకు మనమీద చిన్నచూపు.
తప్పు Abdullaది కాదు, ఇలాంటి Sickular హిందువుది.
వాడు 100% గుడికి రాడు.
నీకెందుకు దర్గాలు?
🤦 @iamMangli pic.twitter.com/LcAwkRPEV8
ఇవి కూడా చదవండి : ఆ డైరెక్టర్‌తో ఎఫైర్ పెట్టుకుంటే సినిమా హిట్టే: Meenakshi Seshadri