- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల బరిలో సింగరేణి వైద్యుడు.. టికెట్ కోసం పొంగులేటితో ఢిల్లీకి
దిశ , రామకృష్ణాపూర్: మాజీ మంత్రి జూపల్లి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసులతో సింగరేణి వైద్యులు డాక్టర్ రాజా రమేష్ సోమవారం కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలిశారు. ఈ సమావేశంలో వివిధ నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం, జాగ్రత్తలు గురించి ఢిల్లీ కమిటీ పెద్దల సమక్షంలో ఇష్టాగోష్టి జరిగిందని సమాచారం. డా.రాజా రమేష్ వృత్తిరీత్యా ఖమ్మం జిల్లాలో సింగరేణి కార్మికులకు వైద్య సేవలు అందించారు. ఆ క్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరావు అలాగే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రికి బదిలీపై వచ్చారు.
కాగా రాజా రమేష్ తల్లిదండ్రులు సింగరేణి ఉద్యోగులు కావడం ఈ ప్రాంతంలో కొలువు తీరడం తనకు కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చి రావడంతోనే రాజా రమేష్ జి ఎస్ ఆర్ అనే ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి కుల సంఘాలు, కార్మికుల సంఘాలు, వివిధ కుల నాయకులతో పరిచయాలు ఏర్పరచుకున్నారు. నియోజకవర్గంలో నిరుపేదలు, మృతి చెందిన కుటుంబ సభ్యులకు నిత్యవసర సరకులు అందించి పలు గ్రామాలకు సేవా సేవ ద్వారా చేరువయ్యారు. ఇలా తన పరిచయాలను పెంచుకుంటూ చెన్నూరు నియోజకవర్గంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చెన్నూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే అభ్యర్థులు సుమారు ఆరుగురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో డాక్టర్ రాజా రమేష్ ఎలా ఇముడుకుంటారో వేచి చూడాల్సిందే.