- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లంచం తీసుకున్న ఎస్ఐకి జైలుశిక్ష
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : అధికారికంగా సహాయపడేందుకు లంచం తీసుకున్న సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఏసీబీ కేసుల కోర్టు ప్రిన్సిపల్స్పెషల్జడ్జి శుక్రవారం తీర్పు చెప్పారు.వివరాలు ఇలా ఉన్నాయి. 2013వ సంవత్సరంలో ఆవుల ప్రసాద్హైదరాబాద్ఆబిడ్స్పోలీస్స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో కే.మాధవరెడ్డి అనే వ్యక్తిపై పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్506, 509 సెక్షన్ల ప్రకారం కేసులు (క్రైం నెంబర్121/2013) నమోదయ్యాయి.
అయితే, ఈ సెక్షన్లకు అదనంగా ఐపీసీ 354 సెక్షన్‌ను చేర్చకుండా ఉండాలంటే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని సబ్ఇన్స్పెక్టర్ప్రసాద్డిమాండ్చేశాడు. దాంతో మాధవరెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని లంచం తీసుకుంటుండగా సబ్ఇన్స్పెక్టర్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసులు నమోదు చేసి కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సబ్ఇన్స్పెక్టర్ప్రసాద్కు అవినీతి నిరోధక చట్టం సెక్షన్7 ప్రకారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, అయిదువేల రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో మూడు నెలలపాటు సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక, సెక్షన్13(1)(డీ) రెడ్‌విత్13(2) ప్రకారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, అయిదువేల రూపాయల జరిమానా విధించింది. జరిమానా కట్టకపోతే మూడు నెలలపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది. రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని పేర్కొంది.