Rachakonda Police: ఆ సమయంలో మీ మానవత్వాన్ని చాటుకోండి.. రాచకొండ పోలీస్ ఇంట్రెస్టింగ్ వీడియో

by Ramesh Goud |
Rachakonda Police: ఆ సమయంలో మీ మానవత్వాన్ని చాటుకోండి.. రాచకొండ పోలీస్ ఇంట్రెస్టింగ్ వీడియో
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రమాదం జరిగినప్పుడు హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేసి మీ మానవత్వాన్ని చాటుకోవాలని, భాదితుల ప్రాణాలను కాపాడాలని రాచకొండ పోలీస్ తెలిపారు. ఆదివారం వీక్టీ థీమ్ వీడియో అంటూ ట్విట్టర్ వేదికగా ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఈ వీడియో ఓ వ్యక్తి చిన్న పల్లెటూరు రోడ్డులో రాత్రివేళ ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి బైక్ ను ఢీ కొట్టాడని, వెంటనే భయంతో ఇంటికి వెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పడుకున్నాడని తెలిపారు. తెల్లవారి లేచి చూస్తే తను ఢీ కొట్టడం వల్ల తన సొంత అన్నతో పాటు పెదనాన్న కొడుకు ప్రాణాలు పోయాయని తెలుసుకొని దు:ఖానికి గురయ్యాడని అన్నారు.

కనీసం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంటే వారు ఇంటికి రాలేదని తెలిసి, ప్రాణాలను కాపాడుకునే వాడినని ఎంతో బాధపడ్డాడని తెలిపారు. దీనిపై రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మీ నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండు ప్రాణం కావొచ్చు, అదే మీ సత్వర స్పందన ఓ కుటుంబ భవిష్యత్తును నిలబెడుతుందని అన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సత్వరం స్పందించి, 108 లేదా డయల్ 100 కు కాల్ చేసి, బాధితుల ప్రాణాలను కాపాడాలని, మీ మానవత్వాన్ని చాటుకోవాలని సూచించారు. చివరగా గుర్తుంచుకోండి!, సమాచారం అందిస్తే, పోలీసు వారు మీకు సహకరిస్తారు అంతేకాని ఇబ్బంది పెట్టరు అని రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed